వాహ్.. ఏపీలో ప్రభాస్ కి లేని హైక్స్ మహేష్ కి..!

పాన్ ఇండియా లెవెల్లో పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మంచి మార్కెట్ ఉన్న హీరోస్ లో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ లు ఒకరు. కాగా ఇపుడు ప్రభాస్ అయితే మినిమమ్ 200 కోట్ల బడ్జెట్ పైగా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు.

దీనితో టాలీవుడ్ నుంచి మోస్ట్ పైడ్ హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ పరంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మార్కెట్ బాగా పెరిగింది. అలాగే మహేష్ బాబు మార్కెట్ కూడా చిన్నదేమీ కాదు. కానీ సినిమా రిలీజ్ విషయానికి వస్తే మాత్రం మహేష్ సినిమాలకి జరుగుతున్నా న్యాయం ప్రభాస్ సినిమాలకి జరగడం లేదని అర్ధం అవుతుంది.

మెయిన్ గా ఏపీలో ఈ పక్షపాతం క్లియర్ గా కనిపిస్తుంది. ఏపీలో ఉన్న రూల్ ప్రకారం ఖచ్చితంగా 100 కోట్లు పైగా బడ్జెట్ పెట్టే ప్రతి సినిమాకి హైక్ ఇస్తామని తెలిపారు. అయితే లాస్ట్ టైం వచ్చిన రాధే శ్యామ్, సర్కారు వారి పాట సినిమాల్లో దేవికి హై బడ్జెట్ అనేది అందరికీ తెలుసు అయ్యినా కూడా జగన్ సర్కార్ ప్రభాస్ సినిమాకంటే మహేష్ సినిమాకే అధిక రేట్లు ఇవ్వడం షాకింగ్ గా మారింది.

ఇక ఇపుడు సలార్, గుంటూరు కారం విషయానికి వస్తే ఇక్కడ బడ్జెట్ పరంగా కూడా సలార్ దే పై చేయి. గుంటూరు కారం లో రెమ్యునరేషన్ లు కాకుండా దానికి 100 కోట్లు అయ్యే ప్రసక్తే లేదు. అలాంటిది సలార్ కి 40 రూపాయలు హైక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం గుంటూరు కారం కి మాత్రం ఏకంగా 50 రూపాయల హైక్ ఇచ్చినట్టుగా వార్తలు బయటకి వచ్చాయి.

దీనితో ఈ అంశాన్ని ఎలా చూడాలి అనేది అర్ధం చేసుకోవాలి. హై బడ్జెట్ సినిమాలకి తక్కువ హైక్ 100 కోట్లు పెట్టని సినిమాకి ఎక్కువ హైక్స్ ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వాపోతున్నారు. మరి దీనికి గల కారణాలు ఏంటో వాళ్లలో వాళ్ళకే తెలియాలి.