బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 రసవత్తరంగా సాగుతుంది. 15 మంది కంటెస్టెంట్స్, ముగ్గురు వైల్డ్ కార్డ్ సభ్యులు బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా వీరిలో ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వ అనారోగ్యంతో నిష్క్రమించింది. ఇక ఈ వారం కూడా మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుండగా, బిగ్ బాస్ హౌజ్‌ను వీడనున్న ఆ కంటెస్టెంట్ ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ వారం నామినేషన్‌లో మోనాల్, అవినాష్, అభిజిత్, దివి, అరియానా, నోయల్ ఉన్న విషయం విదితమే.
ప్రస్తుతం నామినేషన్‌లో ఉన్న ఇంటి సభ్యులలో అవినాష్ అత్యధిక ఓట్లతో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడు. అవినాష్, నోయల్, అరియానాలకు కూడా ఓ మోస్తరు ఓట్లతో సేఫ్ జోన్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక దివి, మోనాల్‌లలో ఒకరు బిగ్ బాస్ గడప దాటనున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే మోనాల్, దివిలకు అంతగా ఓట్లు రాకపోవడానికి గల కారణాలేంటని విశ్లేషిస్తే మోనాల్ హౌజ్‌లో ఆడుతున్న డ్రామాలు ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తున్నాయి. అఖిల్‌తో శృతి మించి రొమాన్స్ చేస్తుందని నెటిజన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. గతవారమే ఆమెని పంపించేయాలని ఓట్లు వేసినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకుల అండదండతో ఆమె సేవ్ అయిందని విశ్లేషిస్తున్నారు.
ఇక దివి విషయానికి వస్తే మొదటి వారం ఇంటి సభ్యుల ప్రవర్తనని ఇట్టే పసిగట్టిన ఆమె రాను రాను రాజశేఖర్ మాస్టర్ అడుగుజాడలలో నడుస్తూ చిరాకు తెప్పిస్తుంది. లాస్యని నామినేట్ చేసే విషయంలో చెత్త రీజన్ చెప్పడం, ఇక్కడి విషయాలు అక్కడ చెబుతుందనే అపవాదు మూటగట్టుకోవడంతో దివికి కూడా కాస్త నెగెటివిటీ పెరిగినట్టు కనిపిస్తుంది. అయితే గతవారమే ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న మోనాల్ ఈ సారి మాత్రం పక్కా ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. ఈ సారి మాత్రం మోనాల్ ఎలిమినేట్ కాని పక్షంలో బిగ్ బాస్ షో అతి పెద్ద అప్రతిష్ట మూటగట్టుకుంటుందని టాక్ . ఒకవేళ ఆ అప్రతిష్ట మూటగట్టుకునేందుకు కూడా వారు సిద్ధమైతే దివిని బయటకు పంపక తప్పదు.
బిగ్ బాస్ అంటేనే ఓ డ్రామా. ఏ క్షణం ఏమైన జరగొచ్చు. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్‌తో బిజీగా ఉండడం వలన ఈ వారం కొత్త గెస్ట్ షోని హోస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్ లేదని చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు.