అనసూయ దెబ్బకు పారిపోయిన బ్రహ్మానందం… అలా అరవాల అంటూ పరువు తీసిన బ్రహ్మానందం?

జూనియర్స్ కార్యక్రమాల్లో భాగంగా యాంకర్లుగా అనసూయ సుధీర్, పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ప్రతి శని ఆదివారంలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది చిన్నారులు తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వచ్చేవారం ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే జరుపుకొనుంది. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇకపోతే అనసూయ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఒక్కసారిగా గట్టిగా వెల్కమ్ టు బ్రహ్మానందం గారు అంటూ అరిచేసింది. ఈ విధంగా అనసూయ గట్టిగా అరవడంతో బ్రహ్మానందం ఒక్కసారిగా పారిపోయి సుదీర్ వెనక దాక్కున్నారు

బ్రహ్మానందం అనంతరం బయటకు వచ్చి అదేంట్రా అలా అరిచింది పక్కనే ఉన్నాను కదా అంత గట్టిగా అరవడం అవసరమా అంటూ పంచ్ వేశాడు.బ్రహ్మానందం ఇలా అనేసరికి ఏదో మీరు వచ్చిన ఆనందంలో అలా అరిచింది సార్ అంటూ సమాధానం చెప్పగా… వెంటనే బ్రహ్మానందం ఇలా కాకుండా ఎలా చెబుతారు. మీరు ఇక్కడికి రావడం చాలా దారుణంగా ఉందని చెబుతారా… అలా అనలేవు కదా అంటూ మరోసారి బ్రహ్మానందం తనదైన శైలిలో సుదీర్ పై కామెడీ పంచ్ వేశారు.ఇలా చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం కామెడీ చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.