బిగ్ బాస్ 4: 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న మోనాల్.. వెళ్ళేట‌ప్పుడు ఎంత ప‌ట్టుకెళ్లిందో తెలుసా?

బుల్లితెర సంచ‌ల‌నం బిగ్ బాస్ సీజ‌న్ 4లో త‌న అంద‌చందాల‌తోనే ఎక్కువ‌గా ఆక‌ట్టుకున్న బ్యూటీ మోనాల్ గ‌జ్జ‌ర్. ఈ గుజ‌రాతీ భామ తెలుగులో బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాలి, సుడిగాడుతో పాటు ఒక‌ట్రెండు చిత్రాల‌లో న‌టించింది. వీటిలో ఏది మంచివిజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో అమ్మ‌డికి ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. బిగ్ బాస్ షోతో అదృష్టం పరీక్షించుకోవాల‌ని సీజ‌న్ 4లో అడుగుపెట్టిన మోనాల్ తెల‌గు బాగా నేర్చుకుంది. కొన్ని టాస్క్‌ల‌లో అబ్బాయిల‌తో పోటిప‌డి త‌న స‌త్తా చాటింది. ఎందరో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను దాటుకొని చివ‌రి వారం వ‌ర‌కు వ‌చ్చింది.

monal eliminated from the bigg boss house

మొద‌ట్లో మోనాల్‌ని చాలా త‌క్కువ‌గా అంచనా వేశారు. ఎక్కువగా ఏడ‌వ‌డం టాస్క్‌ల‌లో పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌క‌పోవ‌డం, అభిజీత్- అఖిల్‌ల‌తో ట్రైయాంగిల్ ప్రేమాయ‌ణం న‌డ‌ప‌డం వంటి విష‌యాల‌తో ప్రేక్ష‌కులలో అస‌హ‌నం తెప్పించింది. కాని రాను రాను త‌నలో స‌త్తా బ‌య‌ట‌కు తీస్తూ 14 వారాల పాటు ఇంట్లో ఉంది . 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండి సంచ‌ల‌నం సృష్టించిన మోనాల్ 98 రోజుల పాటు ఎంత రెమ్యున‌రేష‌న్ అందుకుంది అనే దానిపై బ‌య‌ట జోరుగా చ‌ర్చ నడుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం 30 లక్షల వరకు మోనాల్ తీసుకెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకు ఆమె 30 వేల పారితోషికం అందుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, ఈ సీజ‌న్ బిగ్ బాస్ లో అందరికంటే హైయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న వాళ్లలో మోనాల్ ఒక‌తి అని అంటున్నారు. ఇదే నిజ‌మైతే 98 రోజుల పాటు 30 వేల చొప్పున తీసుకున్న మొత్తంగా
29 లక్షల 60 వేల రూపాయలు అందుకుంది ఈ భామ. రానున్న రోజుల‌లో మోనాల్‌కు సినిమా ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయంగా అనిపిస్తుంది.