మోనాల్ గజ్జర్ తెలివితేటలు సూపర్ .. అభిజీత్ కూడా ఈ రేంజ్ లో సంపాదించట్లేదు..!

మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అడపా దడపా సినిమాలు చేసింది. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం వెలగలేకపోయింది. దాంతో టాలీవుడ్ నుంచి సొంత ఊరెళ్ళిపోయింది మోనాల్ గజ్జర్. చెప్పాలంటే అందరూ మోనాల్ గజ్జర్ ని మర్చిపోయారు. కాని ఇండియా బెగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తో మళ్ళీ లైం లైట్ లోకి వచ్చింది. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో తర్వాత వరుస అవకాశాలతో బిజీ అవుతోంది మోనాల్ గజ్జర్. హీరోయిన్ గా ఫేడవుట్ అయిన మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ షో ద్వారా ఊహించని విధంగా క్రేజ్ సంపాదించుకుంది.

ఈ క్రేజ్ వల్లే మోనాల్ గజ్జర్ టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకుంది. ఈ సాంగ్ కు 15 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ని బట్టి ఈ సాంగ్ కోసం 15 లక్షల కంటే ఇంకా ఎక్కువే అందుకుందని తెలుస్తోంది. ఇక మోనాల్ కు షాప్ ఓపెనింగ్ ఆఫర్లు కూడా బాగా వస్తున్నాయట. ఈ ఆఫర్లకు కూడా మోనాల్ లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను మోనాల్ గజ్జర్ చక్కగా ఉపయోగించుకుంటుందని చెప్పుకుంటున్నారు. సాధారణంగా హీరోయిన్స్ కి లైఫ్ టైం తక్కువ అన్న సంగతి తెలిసిందే. మోనాల్ లాంటి వాళ్ళ కి ఇంకా తక్కువ. అందుకే వీళ్ళు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఫాలో అవుతుంటారు. తెలివిగా అవకాశాలు వచ్చినప్పుడే సంపాదించుకుంటారు. మోనాల్ ఇప్పుడు అదే చేస్తోంది. ఇక స్టార్ మా ఛానెల్ లోనే ఒక షోకు మోనాల్ జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మోనాల్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు కూడా డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారట.