Mohammad Siraj: సిరాజ్‌తో సింగర్ క్లోజప్.. జోరుగా పుట్టుకొచ్చిన గాసిప్స్‌

ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాలీవుడ్ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే మధ్య సన్నిహితతపై చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. జనై తన పుట్టిన రోజు వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, వాటిలో సిరాజ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫోటోలు వైరల్ కావడంతో వీరి మధ్య సన్నిహిత సంబంధాల గురించి గాసిప్స్ మళ్లీ తెరమీదకు వచ్చాయి.

జనై పుట్టిన రోజు వేడుకలకు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. అయితే, సిరాజ్‌తో ఆమె ఫోటో నెటిజన్లను బాగా ఆకర్షించింది. ఆ ఫోటోలో సిరాజ్‌తో కలసి ఆమె నవ్వుతూ కనిపించడం, మరింత చర్చనీయాంశంగా మారింది. పైగా, ఆమె గుజరాత్ టైటాన్స్ జట్టును మాత్రమే ఫాలో కావడం, దీనికి తోడు గతంలో ఆమె సిరాజ్ మ్యాచ్‌లను స్టేడియంలో చూసినట్లు ఉన్న వార్తలు, ఈ రూమర్లకు మరింత ఊతమిచ్చాయి.

గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఐపీఎల్‌లో సిరాజ్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జనై గుజరాత్ టైటాన్స్ జట్టును ఫాలో కావడం, ఈ నేపథ్యంలో సిరాజ్‌తో ఆమె మధ్య ఉన్న అనుబంధం గురించి అనుమానాలు పెరిగాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతుండటాన్ని చూసిన నెటిజన్లు, ఇది వారి అనుబంధానికి నిదర్శనం అని అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఇప్పటి వరకు ఈ గాసిప్స్‌పై సిరాజ్, జనై ఏ విధమైన స్పందన ఇవ్వలేదు. వీరి మధ్య నిజంగానే ఏదైనా ప్రత్యేక బంధం ఉందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ గాసిప్స్ నిజమో కాదో తెలియదు కానీ, సిరాజ్-జనై ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాపిక్‌గా మారింది. అభిమానులు ఈ రూమర్లను ఆసక్తిగా చర్చించుకుంటూ, వారి భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఛీ కామాంధుడు || Geetha Krishna EXPOSED Garikapati Narasimha Rao Wife Issue || Kameshwari || TR