నాకు కాబోయే భార్య సిరి మాదిరి ఉండాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మోడల్ జెస్సీ..!

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మోడల్ జెస్సీ అనారోగ్యం కారణంగా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చిన అనంతరం ఆయన ఆరోగ్యంగా ఉండటంతో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిగ్ బాస్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు జెస్సీ, సిరి, షణ్ముఖ్ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఏర్పడిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే హౌస్ నుంచి జెస్సీ బయటకు రావడంతో సిరి షణ్ముఖ్ ఎమోషనలయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా మోడల్ జెస్సీ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కంటెస్టెంట్ సిరి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Jesse | Telugu Rajyamసిరి మాట బాధపెట్టిన తన మనస్సు ఎంతో మంచిదని,ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నన్ని రోజులు తనని ఎంతో కేరింగ్ చేసిందని తెలిపారు. ముఖ్యంగా తన ఆరోగ్యం బాగా లేని సమయంలో సిరి దగ్గరుండి సేవలు చేసిందని, అప్పటికి పోట్లాడిన ఆ తర్వాత వచ్చి తనతో ఎంతో ప్రేమగా మాట్లాడేదని జెస్సీ ఈ సందర్భంగా సిరి గురించి వెల్లడించారు. ఇంత మంచి అమ్మాయి శ్రీహన్ కు భార్యగా వెళ్లడం నిజంగా తన అదృష్టమని తెలిపారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలు తనకు ప్రపోస్ చేస్తున్నారని జెస్సీ వెల్లడించారు.

అయితే నేను పెళ్లి చేసుకుంటే సిరి లాంటి అమ్మాయి తనకు భార్యగా రావాలని జెస్సీ షాకింగ్ కామెంట్ చేశారు. సిరి మాదిరి ఎంతో ప్రేమగా, కేరింగ్ చేసే అమ్మాయి వస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో జెస్సీ బయటపెట్టారు. ఇలా జెస్సీ సిరి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles