భవాని మాల ధరించిన సిరి.. శ్రీహాన్ కోసమే ఇదంతా చేస్తోందా?

సిరి హనుమంత్ ఇన్ని రోజుల వరకు పెద్దగా తెలియని వారికి కూడా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమె ఎంతో ఫేమస్ అయ్యారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి రాకముందు వరకు ఈమె యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేసేవారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి ఎప్పుడైతే వచ్చారో ఈమె ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అయితే షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి ఈమె చేసిన ఫ్రెండ్షిప్ కారణంగా ఈమె పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఎంతో నెగిటివిటీ మూట కట్టుకున్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో సిరి షణ్ముఖ జస్వంత్ తో ఎంతో చనువుగా ఉన్నారు. ఈమె శ్రీహాన్ తోప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోయి అతనితో చనువుగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున నెగిటివ్ విమర్శలుతాయి.ఒకవైపు షణ్ముఖ దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నారు ఆ విషయాన్ని మర్చిపోయి వీరిద్దరూ చనువుగా ఉండటం వల్ల చివరికి దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ కిబ్రేకప్ చెప్పేసింది. అయితే శ్రీహన్ కూడా సిరికి బ్రేకప్ చెబుతారని అందరూ భావించిన అది జరగలేదు.

శ్రీహాన్ సిరి పరిస్థితి అర్థం చేసుకోవడంతో వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి శ్రీహాన్ కంటెస్టెంట్ గా వెళ్లారు. అయితే గెలుపు కోసం బయట సిరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా భవాని అమ్మవారి మాల ధరించి సిరి కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే సిరి శ్రీహాన్ కోసమే ఇలా భవాని మాల ధరించిందని ఆయన గెలుపు కోసమే ఇలా మాల తీసుకున్నారనే వార్తలు వినపడుతున్నాయి మొత్తానికి ప్రియుడు గెలుపును సిరి బలంగా కోరుకుంటుందని తెలుస్తోంది.