తెలుగు సినిమాల్లో ముద్దు సీన్లు చాలా రేర్. ఒకవేళ మోతాదుకు మించితే సెన్సార్ కత్తెర పడుతుంది. ఒక సెన్సార్ దాటి వచ్చినా బయట సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు ఎంత రచ్చ జరిగిందే అందరం చూశాం. కానీ బాలీవుడ్‌లో సీన్ రివర్స్. అక్కడ ముద్దు సన్నివేశం లేకుండా ఉండే సినిమాలు చాలా రేర్ అని చెప్పాలి. అంతకు మించిన సీన్లు కూడా చాలానే ఉంటాయ్. అయితే ముద్దు సీన్‌ను తెరకెక్కించడం మాములు విషయం కాదు. ఎందుకంటే యూనిట్ అందరిముందు ఎటువంటి సిగ్గు లేకుండా నటించాలి. పర్ఫెక్షన్ వచ్చేవరకు ఎన్ని టేక్స్ అయినా చెయ్యాలి. ఇది ఒక రకంగా హీరోయిన్లకు ఇబ్బందికరమే. కొంతమంది తెలుగు హీరోలు కూడా ముద్దు సన్నివేశాలు అంటే ఆమడదూరం పారిపోతారని విన్నాం. దీంతో టేకుల మీద టేకుల సదరు సన్నివేశాన్ని తీయాల్సి వస్తుంది.
కొందరు దర్శకులు కూడా సరైన ఎమోషన్ వచ్చేవరకు ఇలాంటి సీన్స్‌ను అస్సలు వదిలిపెట్టరు. వివిధ యాంగిల్స్‌లో టేకుల మీద టేకులు తీసుకుంటారు. ఒక సన్నివేశం తాను అనుకున్న విధంగా వచ్చే వరకూ యాక్టర్స్‌తో నటింపజేస్తూనే ఉంటారు. అయితే శృంగార సన్నివేశాల్లో వారికి ఎటుంటి ఇబ్బంది లేకుండా దర్శకులు రెండుమూడు టేకులతో సరిపెట్టేస్తుంటారు. అయితే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ మాత్రం తాను ఏ దశలోనూ రాజీపడను అన్నట్లు ఓ కిస్ సీన్‌ను తెరకెక్కించారు.
సుభాష్ ఘయ్ ‘కాంచి’ అనే సినిమాను తీశారు. కార్తిక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరిపై ఓ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ నటీనటులు ముద్దు విషయంలో కాస్త సిగ్గుపడ్డారట. ఆ ఇబ్బందుల వల్ల సరిగా రాలేదని భావించి కట్ చెప్పేసి, మళ్లీ ముద్దుపెట్టుకోవాలని సూచించారట. అలా కార్తిక్, మిస్తీలు మొత్తం 37 టేకులు తీసుకున్న తర్వాత గానీ సుభాష్ సంతృప్తి చెందలేదట. అంతసేపు ముద్దులాట చూసి షూటింగ్ యూనిట్ రకరకాల జోకులు వేసుకున్నారట. పాపం ఆ హీరోహీరోయిన్ల ఇంకెంత ఇబ్బంది పడ్డారో కదా!