సినిమా మీద చర్చకి రండి… మీ సమస్యేంటో చెప్పండి

ఈ మధ్యకాలంలో కొత్త టాలెంట్ ఎవరైనా ఏదైనా ఓ మంచి సినిమాని తక్కువ బడ్జెట్ తో తీసి వారిదైన శైలిలో ప్రమోట్ చేసుకొని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు. థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే ఆడియన్స్ ని నచ్చుతుంది. కాని ఫిల్మ్ క్రిటిక్స్ కి నచ్చకపోవచ్చు. క్రిటిక్స్ ఎప్పుడూ కూడా అన్ని వైపుల నుంచి మూవీ చూసి వారి అభిప్రాయాన్ని చెబుతారు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకొని సినిమాపై దుష్ప్రచారం చేస్తారు.

కొత్త కుర్రాళ్ళు సిల్వర్ స్క్రీన్ పై తమ టాలెంట్ చూపించారు అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ లేకుండా ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రోలింగ్ సమస్య ఒక్క చిన్న చిత్రాలకి మాత్రమే కాకుండా స్టార్ వార్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మొదలైన తర్వాత ఇలా ఇతర హీరోల సినిమాలని ట్రోల్ చేస్తూ తమ హీరో గొప్ప సినిమా చేశాడు అని డబ్బా కొట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది.

ప్రేక్షకాదరణ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనుకున్న సినిమాపై విపరీతమైన దుష్ప్రచారం చేస్తూ ఆ మూవీ రెవెన్యూ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నమే ఇప్పుడు మేమ్ ఫేమస్ సినిమాపై కూడా జరుగుతోంది. రిలీజ్ కి ముందు నుంచి కొంతమంది అదే పనిగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేయడం, ట్రోలింగ్ చేయడం చేస్తున్నారు. ముఖ్యంగా సుమంత్ ప్రభాస్ మీద, నిర్మాత శరత్ మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.

రిలీజ్ తర్వాత కూడా ఇదే పంథా కొనసాగుతోంది. దీంతో మేమ్ ఫేమస్ చిత్ర యూనిట్ మీడియా ముందుకి వచ్చి ట్రోలింగ్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సినిమాపై కొంతమంది పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల్లో మూడు కోట్లు వచ్చింది. మీకు ఎవరికైనా సినిమాతో సమస్య ఉంటే ఒక ప్లేస్ ఫిక్స్ చేస్తాం రండి అక్కడ మీ అభిప్రాయాలని కచ్చితంగా చెప్పండి. మేము వింటాం. అలా కాకుండా తొక్కేయాలని చూస్తున్నారు.

మేము ఏదో సాధించాలని ఇండస్ట్రీలోకి వచ్చి మేమ్ ఫేమస్ తో ఒక ప్రయత్నం చేశాం. కాని ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ నిర్మాత శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా అందుకే స్టూడెంట్స్ కోసం 99కె వేస్తున్నాం. కచ్చితంగా వారి నుంచి మంచి ఆదరణ వస్తుందని అనుకుంటున్నాం అన్నారు. ఇక హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ సినిమా చూసే ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. కాని కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం వలన వారికేం వస్తుందో తెలియడం లేదు. కొత్తవాళ్లని ప్రోతహించకుండా ఇలా వెనక్కి లాగడం కరెక్ట్ కాదు. సినిమా చూడండి నచ్చకపోతే చెప్పండి అన్నారు.