ఆంటీ రోల్ ఆఫర్ చేస్తే కస్సుమందట.!

‘కృష్ణ గాడి వీర ప్రేమగాధ’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసి, పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. కమర్షియల్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఓ ఇంటిదైపోయేదే ఈ పాటికి. కానీ, ఎంగేజ్‌మెంట్ తర్వాత అభిప్రాయ బేధాలు రావడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది మెహ్రీన్. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలన్న వుద్దేశ్యంతో ఫిట్‌నెస్‌పై కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయ్యింది.

ఎందుకో తెలీదు. ఏం వికటించిందో అర్ధం కావడం లేదు కానీ, ఈ మధ్య కంప్లీట్‌గా ఫేడవుట్ అయిపోయింది మెహ్రీన్ కౌర్. దాంతో, అవకాశాలు బొత్తిగా రావడం లేదట. గతేడాది ‘ఎఫ్ 3’తో సూపర్ హిట్ కొట్టింది. అయినా కానీ, మెహ్రీన్ ఫిట్‌నెస్ చూసి ఆమెకు అవకాశాలు రావడం లేదంటున్నారు.

ఈ మధ్య ఓ దర్శకుడు ఆంటీ రోల్ ఆఫర్ చేశాడట. ఓ ఐదేళ్ల పాపకి తల్లిగా నటించే పాత్ర కోసం మెహ్రీన్‌ని అప్రోచ్ అవ్వగా.. నే చెయ్యను పో.. అని తెగేసి చెప్పేసిందట. ఐదేళ్ల పాపకు తల్లిగా.. అంటే తప్పేముంది.? మంచి ఛాన్సేగా మిస్ చేసుకుంది మెహ్రీన్ అని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు వయసులో పెద్దదైన తమన్నా మాత్రం హీరోయిన‌్‌గా మంచి ఛాన్సులు దక్కించుకుంటుండడం విశేషం.