“కల్కి 2898AD” సర్ప్రైజ్ లీక్ పై మెగాస్టార్ రియాక్షన్..!

ఇప్పుడు పాన్ ఇండియా సహా పాన్ వరల్డ్ సినిమా దగ్గర కూడా ఇండియన్ సినిమా నుంచి మంచి హైప్ ని క్రియేట్ చేసిన భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “కల్కి 2898AD” అని చెప్పాలి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓ మాసివ్ స్కేల్ లో ఊహించని ఎలిమెంట్స్ తో అయితే తెరకెక్కుతుంది.

కాగా ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి ఒకొక్కరి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక ఈ చిత్రం నుంచి నిన్న ఓ ఇంట్రెస్టింగ్ లీక్ ని అయితే చిత్ర యూనిట్ స్వయంగా చేశారు. కాగా నిన్న తెలుగు సినిమా దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా అయితే కల్కి చిత్రంలో కూడా మెగాస్టార్ డిఫరెన్స్ ఉన్నట్టుగా ప్రభాస్ ఓ ఫైర్ గన్ ని పట్టుకున్న సీన్ ని లీక్ చేశారు.

మరి ఫైర్ గన్ అంటే మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ చేసి ఐకానిక్ సీన్ అందరికీ గుర్తే మరి అలాంటి సీన్ ని కల్కి లో ప్రభాస్ చేయగా నిన్న మెగాస్టార్ బర్త్ డే కానుకగా అయితే దీనిని లీక్ చేస్తున్నాం అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. అంతే కాకుండా ఈ లీక్ అయితే మన టాలీవుడ్ లో పాపులర్ అయ్యిన చిరు లీక్స్ ని ప్రేరణగా తీసుకొని అందిస్తున్నామని ఓ పక్క ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంకో పక్క చిరు ఫాన్స్ కి కూడా ట్రీట్ ఇచ్చారు.

ఇక దీనితో చిరు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ మెయిన్ గా ప్రభాస్ కి థాంక్స్ చెప్తూ చిత్ర యూనిట్ కి తన ప్రేమని అందిస్తున్నాను అని బ్యూటిఫుల్ రిప్లై అయ్యితే అందించారు.