వైరల్ : మనవరాలిపై మెగాస్టార్ మొట్టమొదటి పోస్ట్.!

ఈ ఉదయంతోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఇంట అయితే ఓ శుభ వార్తతో ఆనందం నెలకొంది. మెగాస్టార్ వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే తన భార్య ఉపాసన కొణిదెల లు అయితే తల్లిదండ్రులు అయ్యారు. దీనితో మెగా ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఆనందం నెలకొనగా మరి ఈ శుభవార్త తో అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ మూమెంట్ లో అయితే మెగాస్టార్ తన మొదటి సారిగా అయితే తన మానవరాలిపై అయితే స్పందిస్తూ ఫస్ట్ పోస్ట్ చేశారు. మరి మెగాస్టార్ పోస్ట్ లో అయితే తమ లిటిల్ మెగా ప్రిన్సెస్ కి ఆహ్వానం పలుకుతున్నాం అని అలాగే తాము మాత్రమే కాకుండా మా మెగా ఫ్యామిలీ అభిమానులు అంతా సహా మేము కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని.

అలాగే మా చరణ్ ఉపాసన లను అమ్మ నాన్నలను చేసావు నన్ను తాతని చేసావు అంటూ మెగాస్టార్ అయితే ఎమోషనల్ పోస్ట్ పెట్టడం తన ఆనందాన్ని తెలుపుతుంది. దీనితో మెగాస్టార్ స్పెషల్ పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక మెగాస్టార్ ఇపుడు దర్శకుడు మెహర్ రమేష్ తో అయితే భోళా శంకర్ అనే సినిమా చేస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో “గేమ్ చేంజర్” అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.