మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రీకరణ కోవిడ్ 19 విజృంభణతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అంతకంతకు ఆలస్యమవుతుంటే రామ్ చరణ్ నిర్మాణ భాగస్వామ్యం నుంచి తప్పుకుంటున్నారని .. కేవలం మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ ఆ భారాన్ని మోయనుందని ప్రచారమవుతోంది. ఆర్.ఆర్.ఆర్ చిక్కులు సహా సైరా నష్టం కూడా చెర్రీని మరోమారు ఆలోచనలో పడేసిందట.
తాజా ప్రచారంతో.. ఆచార్యపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ పెరుగుతోందన్నది ఓ విశ్లేషణ. దీంతో అలెర్టయిన సదరు సంస్థ వెంటనే అధికారికంగా దీనిపై వివరణ ఇచ్చింది. ఆచార్య సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ తో కలిసి మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ భాగస్వామ్యం అనేది తప్పనిసరి అని తెలిపింది. బడ్జెట్ ని 50-50 బేసిస్ లో షేర్ చేసుకుంటున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా రిలీజైన ఆచార్య మోషన్ పోస్టర్ అభిమానుల్లో వైరల్ గా మారింది. దేవాదాయ భూముల స్కామ్ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే సినిమా ఇదని ప్రచారమవుతోంది. ఇక పోస్టర్ తో రక్తి కట్టించారు కాబట్టి.. తదుపరి చిత్రీకరణకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారని సిగ్నల్ వచ్చేసినట్టయ్యింది. కేంద్రం షూటింగులకు అన్ లాక్ 4.0 ప్రకారం నియమనిబంధనల్ని పొందుపరిచింది. కోవిడ్ రూల్స్ పాటిస్తూ డేర్ చేసేందుకు ఆస్కారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్రను పోషించనున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగిస్తే కానీ అతడికి ఏ విషయమూ క్లారిటీ రాదు.