Mega Star:మెగా 154 హీరోయిన్ ఫిక్స్…హీరోయిన్ కి స్వాగతం పలికిన చిరు!

Mega Star: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యువ హీరోలతో సమానంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.మరోవైపు వేదాళమ్ రీమేక్ భోళా శంకర్‌, లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉన్నాయి.  ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 154వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా,మైత్రి మూవీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి 8న ఉమెన్స్ డే ను పురస్కరించుకొని, ఈ సినిమా నుంచి ముఖ్యమైన అప్ డేట్ ను ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి బాబి సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ అధికారికంగా ప్రకటించారు.మహిళా దినోత్సవం రోజున ఇంతకంటే మంచి వార్త ఏం ఉంటుంది. వెల్ కమ్ శ్రుతి హాసన్ అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది.  ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మా టీంలోకి శృతిహాసన్‌కు స్వాగతం అంటూ బొకేను అందిస్తున్న ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు.  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


ఇటీవలే శృతిహాసన్ కరోనా నుంచి కోలుకున్న సంగతి అందరికీ తెలిసిందే.క్రాక్ సూపర్ హిట్ తర్వాత శ్రుతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం శృతి హాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తో హీరోయిన్ గా నటిస్తోంది.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ సినిమా కన్నడ తెలుగు భాషల్లో ఓకే కాలం లో తెరకెక్కుతుంది.