ప్రభాస్ వరల్డ్ “ప్రాజెక్ట్ కే” కి రిలీజ్ ఆసక్తికర ఇన్ఫో .!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ సూపర్ స్టార్ హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రమే టాప్ లో ఉన్నాడని చెప్పాలి. ప్రస్తుత జెనరేషన్ లో ప్రపంచ స్థాయి సినిమాని చేస్తున్న ఏకైక ఇండియన్ మరియు తెలుగు హీరోగా తాను నిలిచాడు.

అయితే అలా తాను చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ లలో వరల్డ్ లెవెల్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. దీనిని మినిమమ్ బడ్జెట్ గా నిర్మాత సి అశ్వనీదత్ 500 కోట్లు కేటాయించి చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అనేది.

ఇక ఈ చిత్రాన్ని ఇప్పుడు మేకర్స్ శరవేగంగా సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేస్తుండగా ఈ సినిమా పై అయితే నిర్మాత కొన్ని మాసివ్ అప్డేట్స్ ని బయట పెట్టారు. ఈ సినిమాని హాలీవుడ్ భారీ సినిమాలు ఎవెంజర్స్ తరహాలో ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు నాగ్ అశ్విన్ పై చాలా నమ్మకం ఉందని.

అయితే సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది చివరికి పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నామని అలాగే అక్కడ నుంచి మరో 8 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులకి కేటాయించి 2024 అక్టోబర్ 18న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టుగా తాను తెలిపారు.

మొత్తానికి అయితే ఈ భారీ సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ అందరికీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.