ఓటిటికి సెంటిమెంట్ తో “మంగళవారం” టీం..!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన చిత్రాల్లో పెద్ద పెద్ద హీరోస్ కంటే కూడా చిన్న హీరోలు మిడ్ రేంజ్ సినిమాలే అత్యధికంగా సక్సెస్ ఫుల్ అయ్యాయి అని చెప్పాలి. కాగా ఈ చిత్రాల్లో ఈ నవంబర్ రిలీజ్ కి వచ్చిన చిత్రాలు కూడా ఉండగా వాటిలో ఒక అడల్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “మంగళవారం” కూడా ఒకటి.

గ్లామర్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో తన మొదటి సినిమా దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ చిత్రం క్రేజీ హిట్ అయ్యింది. అయితే థియేటర్స్ లో అదరగొట్టిన ఈ సినిమా నెక్స్ట్ ఓటిటిలో ఎప్పుడు వస్తుందా అనేది కూడా అంతా ఎదురు చూస్తూ వచ్చారు.

ఇక ఫైనల్ గా దీనికి అయితే డేట్ వచ్చేసింది. కాగా మేకర్స్ ఈ సినిమాని ఈ డిసెంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మొత్తం పాన్ ఇండియా భాషల్లో కూడా మంగళవారం సినిమాని తాము ఫిక్స్ చేశారు. అయితే ఈ డేట్ చూస్తే సరిగ్గా మంగళవారమే పెట్టుకున్నారు. తమ సినిమా పేరు కూడా మంగళవారమే కావడంతో ఓటిటి రిలీజ్ ని సెంటిమెంట్ గా అదే రోజున ఫిక్స్ చేసుకున్నారని చెప్పాలి.

కాగా మిగతా సినిమాలు అయితే ప్రతి శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి. అన్నట్టు ఈ సినిమాని హాట్ వారు కొనుక్కున్నారు. మరి చూడాలి అనుకుంటే నెక్స్ట్ మంగళవారం నుంచి ఈ మంగళవారం సినిమాని హాట్ స్టార్ లో చూడవచ్చు. కాగా ఈ సినిమాలో యంగ్ హీరో ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించగా కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ ఎక్స్ట్రార్డినరీ సంగీతం ఈ సినిమాకి అందించాడు.