“సలార్” తో “మంగళవారం” విడుదల??

Mangalavaram Movie Review

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు శృతి హాసన్ లు కథానాయకుడు కథానాయికలుగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా కూడా ఈ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ చిత్రంతో పాటుగా పాయల్ రాజ్ పుత్ నటించిన అడల్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “మంగళవారం” కూడా రిలీజ్ కాబోతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మంగళవారం సినిమా ఆల్రెడీ థియేటర్స్ లో వచ్చి వెళ్ళిపోయింది కదా అనుకుంటున్నారు.

ఇది నిజమే కానీ సలార్ తో పాటే మంగళవారం కూడా ఓకే రోజు ఆడియెన్స్ ని పలకరించడం జరుగుతుంది అని అంటున్నారు. ఇదెలా అంటే ఆరోజు సలార్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే మంగళవారం సినిమా అయితే ఓటిటిలో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో దీనిపై అధికారిక అప్డేట్ ఇంకా బయటకి రావాల్సింది. కాగా ఈ చిత్రం హక్కులు హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా అందులో పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ సినిమా రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఇలా రెండు సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయని చెప్పాలి. కాగా సలార్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా మంగళవారం చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు.