వైరల్ : ట్రోలర్స్ కి అదిరే రిప్లై లు ఇస్తున్న మంచు విష్ణు.!

టాలీవుడ్ లో ఉన్నటువంటి సెపరేట్ వరల్డ్ ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. అయితే వీరి నుంచి ఇప్పుడు రిలీస్ వస్తున్న మరో చిత్రం “జిన్నా”. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యా దర్శకత్వం వహించగా ప్రముఖ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ ఫుట్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు.

అయితే ఈ చిత్రాన్ని మొన్న దసరా కానుకగా ప్లాన్ చెయ్యగా భారీ పోటీ ఉండడంతో అక్కడ నుంచి జిన్నా భాయ్ తప్పుకొని నెక్స్ట్ ఈ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసాడు. మరి ఈ సినిమా విషయంలో తాను ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తుండగా సోషల్ మీడియాలో కూడా తాను మంచి బిజీగా ఉన్నాడు.

అయితే మంచు విష్ణు విషయంలో కొన్నాళ్లుగా ఎన్నో ట్రోల్స్ ఉన్న సంగతి తెలిసిందే. అలా ఓ నెటిజన్ అయితే మంచు విష్ణు జిన్నా ని ప్రపంచ భాషలు జపాన్, కొరియా చైనా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు అంటగా అని వ్యంగ్యంగా అడగగా దానికి సూపర్ రిప్లై ఇచ్చేసాడు మంచు విష్ణు. అవును ప్లాన్ లు ఉన్నాయి నువ్వేమైనా కొనాలి అనుకుంటున్నావా అని రివర్స్ పంచ్ వేసాడు. దీనితో ఈ రిప్లై వైరల్ గా మారిపోయింది.