గరికపాటి, చిరంజీవి వివాదం పై స్పందించిన మంచు విష్ణు

కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఈవెంట్ లో గరికపాటి, చిరంజీవి ల మధ్య ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ ఈవెంట్ లో గరికపాటి ప్రసంగం మొదలుపెట్టే టైం లో జనాలు అతన్ని పట్టించుకోకుండా చిరంజీవి తో ఫోటోలు దిగడానికి తొందరపడుతున్నారు. సహనం కోల్పోయిన గరికపాటి చిరంజీవి ని ఫోటో లో దిగడం ఆపమని లేకుంటే తాను వెళ్లిపోతానని కొంచెం గట్టిగానే అన్నాడు.
దీంతో నాగబాబు గరికపాటి పై గట్టి కౌంటర్ వేసాడు. రామ్ గోపాల్ వర్మ కూడా గరికపాటి ని విమర్శించాడు. తాజాగా మంచు విష్ణు కూడా దీని పై స్పందించాడు. ఏం జరిగిందో నాకు కరెక్ట్ గా తెలియదు కానీ అయితే చిరంజీవి తో ఫోటో తీసుకోవడం అనేది ఫ్యాన్స్ కి ఒక సువర్ణావకాశం లాంటిది అని తెలిపారు విష్ణు.చిరంజీవి గారు ఒక లెజెండ్, ఆయన దగ్గరకి ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోటో తీసుకుంటారు.
అది సహజ విషయం అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ అంత పెద్ద స్టార్స్ ఉండేటప్పుడు అభిమానులు ఉత్సాహంగా ఉంటారు.
ఆ సమయంలో అభిమానుల ఆత్రుతని ఎవరూ ఆపలేరు అని తెలిపాడు మంచు విష్ణు.అయితే మంచు విష్ణు కూడా చిరంజీవికి మద్దతుగా మాట్లాడాడు. ప్రస్తుతం ‘జిన్నా’ సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీ గా ఉన్న విష్ణు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు.