ప్యాన్ ఇండియా సినిమా కన్నప్పపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం విష్ణు ప్రమోషన్లకు బరిలోకి దిగేశాడు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియా మీదనూ యాక్టివ్‌గా సినిమా విశేషాలు పంచుకుంటూ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
ఇక సినిమాపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం ఏంటంటే.. డార్లింగ్ ప్రభాస్ పాత్ర. విష్ణు లేటెస్ట్ స్టేట్‌మెంట్ ప్రకారం, ప్రభాస్ ఈ సినిమాలో సుమారు 30 నిమిషాల పాటు స్క్రీన్‌పై కనిపించనున్నాడు. ఇది కేవలం కెమెరా ముందు చిన్న గెస్ట్ అప్పియరెన్స్ కాదని, కథలో కీలక మలుపుగా మారే పార్ట్ అని చెబుతున్నారు. మోహన్ బాబుతో ప్రభాస్ వాగ్వివాదం ఓ హైలైట్ సీన్‌గా ఉండబోతోందని వెల్లడించారు. ఈ సీన్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లకు అదిరే ప్లాన్ సిద్ధమవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏదైనా శివ పుణ్యక్షేత్రంలో నిర్వహించాలని భావిస్తున్న టీమ్, ఆ వేడుకకు ప్రభాస్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్, ఫౌజీ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, కన్నప్ప డబ్బింగ్ పూర్తిచేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రభాస్ ఈ సినిమా పనుల కోసం తిరిగి బిజీ కానున్నాడు.
ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఉత్తరాదిలోనూ భారీ రేంజ్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి స్టార్ క్యాస్టింగ్‌తో పాటు, ప్రభాస్ యాడ్ చేశాడు అంటే అదే సినిమాకు అత్యధిక ఓపెనింగ్స్ రావడానికి ట్రిగ్గర్ అవుతుంది. ఈసారి మాత్రం విష్ణు అన్నీ కచ్చితంగా ప్లాన్ చేసుకుంటూ, ‘కన్నప్ప’ని తన బెస్ట్ సినిమాగా నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.