మంచు విష్ణు “కన్నప్ప” పోస్టర్ ఏదో తేడాగా ఉందే… 

టాలీవుడ్ లో మంచి ఫన్ అండ్ కాంట్రవర్సీ ఫామిలీస్ లో మంచు వారి కుటుంబం కూడా ఒకటి. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో షైన్ అయ్యారు కానీ ఇప్పుడు వారి చిత్రాలు ట్రోల్స్ వరకు మాత్రమే పరిమితం అయ్యిపోయాయి. కానీ హీరో మంచు విష్ణు చేస్తున్న చిత్రం అయితే “కన్నప్ప” అన్నిటికీ సమాధానం ఇచ్చేలా రెడీ చేస్తున్నారు.

ఏకంగా ప్రభాస్, మోహన్ లాల్ ఇలా ఇండియా వైడ్ ఎందరో బిగ్ స్టార్స్ తో అయితే చేస్తున్న ఈ సినిమాని హిందీలో సెన్సేషనల్ హిట్ అయ్యిన సీరియల్ మహాభారతం దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. మరి దీనితో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈరోజు తెల్లవారున సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

చూసిన వెంటనే మంచు విష్ణు నిజంగానే ఏదో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు అనిపించక మానదు. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పోస్టర్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయ్యిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రెడీ చేసిన పిక్ లా ఉంది. కొన్ని జలపాతాలు వాటి మధ్య డిజైన్ ఓ శివ లింగం లా డిజైన్ చేయడం ఆ ఏ ఐ పని లానే అనిపిస్తుంది.

అది కాకుండా అయితే ఇది నిజంగా ఓ యూనిక్ డిజైన్ అని చెప్పాలి. మరి ఈ పోస్టర్ ని ఎలా రెడీ చేసారో వారికే తెలియాలి. ప్రస్తుతానికి అయితే పోస్టర్ కి మంచి రెస్పాన్స్ నే వస్తుంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుండగా మంచు మోహన్ బాబు భారీ వ్యయంతో దీనిని నిర్మాణం వహిస్తున్నారు చాలా వరకు సినిమా న్యూజిలాండ్ లోనే కంప్లీట్ కానుంది.