ఈ నెల 30న విడుదల కాబోతున్న భైరవం సినిమా వివాదాల మధ్య సెన్సేషనల్‌గా మారింది. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మాస్ యాక్షన్ చిత్రం, తమిళ హిట్ గరుడన్ కు తెలుగు రీమేక్‌గా రూపొందింది. ప్రమోషన్లలో జోష్ నింపుతున్న చిత్ర యూనిట్‌కు, దర్శకుడు విజయ్ కనకమేడలపై కొంత నెగటివ్ ప్రచారం ఎదురవుతోంది. ప్రత్యేకించి, మెగాస్టార్ చిరంజీవిపై ఆయన గతంలో చేసిన ఓ ఫోటో ఎడిట్ వివాదంగా మారింది.
ఈ విషయంపై ఇప్పటికే దర్శకుడు వివరణ ఇచ్చగా, ఇప్పుడు హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘‘సినిమా కోసం ఎంత కష్టపడుతున్నామో ప్రజలు అర్థం చేసుకోవాలి. డైరెక్టర్ విజయ్ పవన్ అభిమానిగా మాట్లాడిన మాటలు తప్పుగా తీసుకున్నారు. అదీ 2011లో చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌ను ఇప్పుడు లేవనెత్తుతున్నారు. నిజానికి ఆ పోస్ట్ విజయ్‌దేనా? లేక హ్యాక్ అయ్యిందా? ఇంకా స్పష్టతలేదు. పవన్ ఫ్యాన్ అయిన డైరెక్టర్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడమంటే లాజిక్‌కే రాదు’’ అని మనోజ్ వివరించారు.
‘‘సినిమా మీద బాయ్‌కాట్ ట్రెండ్‌లను పెట్టడం సబబు కాదు. నటీనటుల కష్టాన్ని, టెక్నీషియన్స్ శ్రమను అర్థం చేసుకోవాలి. మా సినిమాకి రాజకీయ రంగులు అద్దడం అవసరం లేదు. భైరవంను సినిమాగా చూడండి, రాజకీయంగా కాదు’’ అంటూ మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన అభ్యర్థనకు ఫ్యాన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. ట్రైలర్, పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో, ఈ వివరణతో నెగటివిటీ తగ్గి సినిమాకి పాజిటివ్ బజ్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
