Manchu Manoj : మంచు మోహనబాబు కొడుకు గా సినీ ఇండస్ట్రీ కొచ్చిన మనోజ్ తన నటనతో కామెడీ టైమింగ్ తో హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ బాబు, మంచు లక్ష్మి,విష్ణులపై సామాజిక మధ్యమాలలో జోరుగా ట్రోలింగ్ జరుగుతున్న మంచు మనోజ్ పై మాత్రం ఇలాంటి నెగెటివిటీ లేదు.
దీనికి కారణం మనోజ్ అందరితోనూ సత్సంబంధాలు పెట్టుకోవడం. సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. పైగా ఏదైనా విషయం పై చాలా త్వరగా స్పందిస్తాడు మనోజ్ అందుకే మంచు కుటుంబంలో మనోజ్ కు మంచి పేరు ఉంది.ఇక మనోజ్ ఇటీవలే ఒక కార్యక్రమములో మాట్లాడుతూ మా అధ్యక్షా ఎన్నికల గురించి, వారి కుటుంబంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం గురించి మాట్లాడారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో జనాలు విష్ణును గెలిపించారని మనోజ్ చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి మాత్రం మా అన్న విష్ణును టార్గెట్ చేశారని మనోజ్ తెలిపారు. ఆ వ్యక్తి టార్గెట్ చేసినా అన్న కానీ నాన్నగారు కానీ పట్టించుకోలేదని మనోజ్ వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాకు మద్దతు ఇచ్చిన వాళ్లను కూడా టార్గెట్ చేసిన వ్యక్తి బూతులు తిట్టాడని మనోజ్ పేర్కొన్నారు.
వాళ్లెందుకు అలా చేశారని నేను ఆలోచించానని వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదని నాన్న తనకు చెప్పారని మనోజ్ చెప్పుకొచ్చారు. నాన్న చెప్పింది కరెక్టే కదా అని అనిపించిందని మనోజ్ కామెంట్లు చేశారు. అన్నను టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ జనాలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు ఉన్నారని మనోజ్ తెలిపారు. ఆయనకు మాత్రం ఏదీ లేదని మనోజ్ సెటైర్లు వేశారు. ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చిన ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తిపై మనోజ్ ఈ కామెంట్లు చేశారు.