మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మనోజ్, విష్ణు మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా, సంక్రాంతి సమయంలో ఈ వివాదం మరింత ఉత్కంఠగా మారింది. తాజాగా మోహన్ బాబు దీనిపై తన చర్యలు ప్రారంభించడంతో విషయం మరింత ఘర్షణాత్మకంగా మారింది. మంచు మోహన్ బాబు జల్ పల్లిలో ఉన్న తన ఆస్తులను ఆక్రమించుకున్నారని వారిపై ఫిర్యాదు చేశారు. అంటే పరోక్షంగా మనోజ్ ను మళ్ళీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన లేఖలో, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను తిరిగి తన ఆధీనంలోకి తీసుకురావాలని మోహన్ బాబు కోరారు. ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఈ ఫిర్యాదును పరిశీలించి, ఆస్తులపై నివేదిక అందించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.
ఈ నేపథ్యంలో, ప్రస్తుతం జల్ పల్లిలోని ఆస్తుల్లో నివసిస్తున్న మనోజ్‌కు ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఫ్యామిలీ మధ్య ఘర్షణ మరింత పెరిగే సూచనలున్నాయి. ఇదిలా ఉంటే, మోహన్ బాబు ఈ వ్యవహారంపై మౌనంగా ఉండడం కాకుండా చర్యలు తీసుకోవడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మనోజ్, మౌనిక దంపతులు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ సందర్శన అనంతరం ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది. మొత్తానికి, ఈ సంఘటన మంచు ఫ్యామిలీలో విభేదాలు మరింత లోతుగా ఉన్నాయన్న సంకేతాలను ఇస్తోంది.