ఆమెకి మెగా ఛాన్స్.! లక్కు తోక తొక్కిందంతే.!

తెలుగు సినిమాకి హీరోయిన్ల కొరత వుంది. అందునా, సీనియర్ హీరోల పక్కన నటించే అందాల భామలకి కొరత ఇంకా ఎక్కువగానే కనిపిస్తోంది. ‘మాస్టర్’ ఫేం (తమిళ సినిమా) మాళవిక మోహనన్, ఎప్పుడో చాన్నాళ్ళ క్రితమే ఓ తెలుగు సినిమా చేయాల్సి వుంది. ఆ సినిమా టైటిల్ ‘హీరో’. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఆ సినిమా తెరకెక్కాల్సి వుంది. సినిమా షూటింగ్ ప్రారంభమైంది, ఆగిపోయింది కూడా.

ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తోంది మాళవిక మోహనన్. తాజాగా మాళవిక మోహనన్‌కి మెగా ఛాన్స్ దక్కిందట. చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే సినిమా కోసం మాళవిక పేరు పరిశీలనలో వుందంటున్నారు.

చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ మీద ఫోకస్ పెట్టారు. త్వరలోనే, తన తదుపరి సినిమాకి సంబంధించిన వివరాల్ని చిరంజీవే స్వయంగా వెల్లడిస్తారట.