రాజమౌళి సినిమా కోసం మహేష్ ని పిండేస్తారట.!

ఇండియన్ సినిమా నుంచి ఇప్పుడు ఎన్ని బిగ్ ప్రాజెక్ట్ లు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో అయితే వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వస్తే మాత్రం మిగతావి పక్కకి తప్పుకోవాల్సిందే. మరి ఈ చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ లో రానున్న భారీ చిత్రం.

మరి ఇది మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమా కాగా ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కావడానికి సమయం ఉంది. కాగా ఈ గ్యాప్ లో మహేష్ బాబు “గుంటూరు కారం” చిత్రాన్ని త్వరగా ఫినిష్ చేయాలని చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ అయితే ఇపుడు నడుస్తుంది. అయితే రాజమౌళి సినిమా విషయంలో ఇప్పుడు కీలక అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటివరకు ఏ సినిమాకి పడని కష్టం చేయాల్సి ఉందట. ఇంకా సినిమా స్టార్ట్ కాకముందే మహేష్ ని మేకర్స్ బాంగ్ కాక్ కి పంపేస్తారట. అక్కడ మార్షల్ ఆర్ట్స్, ట్రెక్కింగ్, హైకింగ్, మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఇలా చాలానే మెళుకువలు మహేష్ నేర్చుకోబోతున్నాడు అని తెలుస్తుంది.

అలాగే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో అయితే ఈ సినిమా కోసం మహేష్ ని మొత్తం పిండేసేలా ఉన్నారని చెప్పాలి. అయితే మహేష్ ఇది వరకే ఎన్నో చిత్రాల్లో ఎన్నో రిస్క్ లు చేసాడు. కానీ ఇది అంతకు మించి సినిమా కాబట్టి మరింత స్థాయిలో కష్టపడాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూడాలి.