బన్నీ, రాజమౌళి సినిమాల్లో ఛాన్స్ వదులుకున్న మాధవీలత.. ఏమైందంటే?

స్టార్ హీరో అల్లు అర్జున్ సినీ కెరీర్ లో ఎక్కువ సంఖ్యలో హిట్ సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు మాత్రం అల్లు అర్జున్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టినా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. అలా బన్నీ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో వరుడు సినిమా ఒకటి. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమా నిర్మాతకు కూడా భారీ నష్టాలను మిగిల్చింది.

అయితే బన్నీ సినిమా వరుడులో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినా తాను వదులుకున్నానని మాధవీలత చెప్పుకొచ్చారు. పదో తరగతి తర్వాత మన స్నేహితులు ఇంటర్ లో వేర్వేరు గ్రూపులు తీసుకుంటారని ఎవరి ఆశయాలకు అనుగుణంగా గ్రూపులు ఎంచుకుంటారని అదే విధంగా నేను రాజకీయ పార్టీని ఎంచుకున్నానని ఆమె వెల్లడించారు. తాను సమాజం గురించి తెలుసుకోవాలని సోషియాలజీ తీసుకున్నానని ఆమె తెలిపారు.

తాను యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ అని అందుకే తాను బీజేపీని సపోర్ట్ చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మా తాత టీడీపీ పెట్టేవరకు ఓటుహక్కును వినియోగించుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేస్తామన్న పార్టీకి ఓటు చేయాలని భావించి బీజేపీకి ఓటు వేశామని ఆమె కామెంట్లు చేశారు. సినిమా పరంగా బాధపడ్డ సన్నివేశాలు లేవని ఆమె వెల్లడించారు. నాకు నచ్చిన విధంగా నేను ఉంటానని ఆమె అన్నారు.

వరుడు సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ ను నాతో చేయించాలని అనుకున్నారని డేట్స్ అడ్జస్ట్ చేయడం తెలియక ఆ సినిమాను తాను వదులుకున్నానని ఆమె వెల్లడించారు. యమదొంగ సినిమాలో యంగ్ యమా సాంగ్ లో ఛాన్స్ వచ్చిందని ఆ ఛాన్స్ ను కూడా తాను వదులుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. నచ్చావులే తర్వాత ముగ్గురు సినిమాలలో మూడు సాంగ్స్ వచ్చాయని కానీ వదులుకున్నానని అమె తెలిపారు.