ట్విట్టర్ రివ్యూ : “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమాకి షాకింగ్ రెస్పాన్స్ ఇది.!

ఇప్పుడిప్పుడే మళ్ళీ మన టాలీవుడ్ సినిమా దగ్గర సినిమాలు ఒకొకటిగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలుస్తున్నాయి. కంటెంట్ పరంగా మాత్రమే కాకుండా వసూళ్లతో కూడా గత నెల నుంచి సినిమాలు అదరగొడుతుండగా ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాలు కూడా తమ అదృష్టం పరీక్షించుకోడానికి వచ్చాయి.

అయితే ఈ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా ఉప్పెన నటి కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన లెంగ్తీ టైటిల్ సినిమా “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” కూడా ఒకటి.

అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది అని చాలా మంది ఆసక్తిగా చూసారు ముఖ్యంగా ఇంద్రగంటి సినిమాల కోసం తెలిసిన వారు ఆసక్తిగా చూసారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమాకి ఇప్పుడు చాలా పాజిటివ్ రిపోర్ట్స్ ట్విట్టర్ నుంచి కనిపిస్తున్నాయి.

సినిమా వీరి కాంబోలో మళ్ళీ ఆకట్టుకుంది అని మంచి మెసేజ్ హీరో హీరోయిన్ నటన డైలాగ్స్ సినిమాలో చాలా బాగున్నాయట. దీనితో మళ్ళీ టాలీవుడ్ నుంచి ఓ మంచి సినిమా వచ్చింది అని వారు అంటున్నారు. క్లైమాక్స్ కూడా చాలా బాగుందని అంటున్నారు. మొత్తంగా అయితే ఈ సినిమాకి మంచి రివ్యూస్ వినిపిస్తున్నాయి.