ఇంట్రెస్టింగ్ : తెలుగులో బేబమ్మ “ఉప్పెన” కన్నా ముందే ఈ సినిమా ఓకే చేసిందట.!

krithi setty got a chance to do movie with natural star nani

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర రైజ్ అవుతున్న లేటెస్ట్ యంగ్ హీరోయిన్స్ లో తన మొదటి సినిమా తోనే అదరగొట్టిన టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి కూడా ఒకరు. అయితే తన మొదటి సినిమాగా “ఉప్పెన” సినిమాతో తెలుగు సినిమా దగ్గర వెండితెర పై ఫస్ట్ టైం కనిపించి టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా నిలిచింది.

అయితే అక్కడ నుంచి మరిన్ని సినిమాల్లో తాను నటించి మంచి హిట్స్ అందుకొని కోట్లలో పారితోషకం తీసుకుంటూ స్టార్ స్టేటస్ తెచ్చేసుకుంది. అయితే ఉప్పెన సినిమా తోనే బేబమ్మ గా పరిచయం అయ్యిన తాను నిజానికి టాలీవుడ్ లో ఫస్ట్ తెలుగులో ఒప్పుకున్నా సినిమా “ఉప్పెన” కాదట.

అంతకు ముందే తెలుగులో ఇంకో సినిమాకి తాను డీల్ చేసుకుంది. మరి ఇంతకీ ఆ సినిమా కూడా మరేదో కాదు నిన్న శుక్రవారం రిలీజ్ అయ్యిన చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా అట. నిజానికి ఉప్పెన సినిమా ఎప్పుడో 2018 లో స్టార్ట్ అయ్యింది.

2021 లో రిలీజ్ అయ్యింది. కానీ అంత కన్నా ముందే మా సినిమా ఓకే చేసింది అని లేటెస్ట్ గా హీరో సుధీర్ బాబు అసలు విషయం చెప్పాడు. దీనితో కృతి శెట్టి ఆ సినిమా ఓకే చేసిన లాస్ట్ కి ఇదే లేట్ గా మొదలయ్యి ఇప్పుడు రిలీజ్ కి వచ్చింది.