కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు అండగా నిలిచిన మా అధ్యక్షుడు.. మంచు విష్ణు!

కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ మహమ్మారి బారిన పడి సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది మృతి చెందారు. తాజాగా మరోసారి కరోనా ఉగ్రరూపం దాలుస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు కరోనా బారినపడి ఆస్పత్రి పాలవుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గత ఐదు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి అధికంగా ఇన్ఫెక్షన్ కావడం వల్ల రోజుకు లక్షలలో ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించడంతో తమకు ఆర్థిక సహాయం చేయాలని మాస్టర్ చిన్న కుమారుడు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలోనే నటుడి సోనుసూద్ స్పందించి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదే విధంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా అతని ఆరోగ్యంపై స్పందించి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు తెలుస్తోంది. శివ శంకర్ మాస్టర్ తెలుగు తమిళ చిత్రాలలో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించలేదు.

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇతని ఆరోగ్యం పై స్పందించారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు స్పందిస్తూ తాను ఏఐజి హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడానని శివ శంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని ఈయన వైద్య సిబ్బందితో మాట్లాడినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే శివ శంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ తో మాట్లాడి ధైర్యంగా ఉండాలని ఏ సమయంలోనైనా తమ కుటుంబానికి అండగా ఉంటామని విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇకపోతే మాస్టర్ పెద్ద కుమారుడు, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.