జీవితంలో ప్రేమ ఎంతో ముఖ్యం… ప్రేమ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన చైతన్య!

అక్కినేని నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోని డిజాస్టర్ సినిమాగా నిలబడింది. ఈ సినిమా అనంతరం ఈయన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో కలసి నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య తెలుగు హిందీ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇంటర్వ్యూలలో భాగంగా నాగచైతన్య తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత అంటే తనకు చాలా గౌరవమని ఇప్పటికీ ఎప్పటికీ తనపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని తెలిపారు. ఈ ప్రశ్న అనంతరం నాగచైతన్యకు యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. జీవితంలో తిరిగి ప్రేమలో పడటం ప్రేమించడం వంటివి ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

ప్రేమ అనేది మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. మనం బ్రతకడానికి గాలి ఎంత అవసరమో మన జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్యమని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.మనం ప్రేమించాలి ప్రేమను స్వీకరించాలి అప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలము జీవితంలో ముందుకు వెళ్ళగలము అంటూ ఈయన ప్రేమ గురించి చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే నాగచైతన్య తిరిగి ప్రేమలో పడతారని పెళ్లి కూడా చేసుకోవడానికి తన సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.