షాకింగ్ : “సలార్” రీమేక్ అనడానికి ఎన్నో ప్రూఫ్స్..!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ హైప్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన మాసివ్ ఏక్షన్ డ్రామా “సలార్” పార్ట్ 1 కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సంచలన ప్రాజెక్ట్ ఇది వరకే రిలీజ్ కావాల్సింది..

కానీ మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని పలు కారణాలు చేత ఈ డిసెంబర్ కి వాయిదా వేశారు. ఇక ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాపై ఇప్పుడు ఊహించని విధమైన భారీ నెగిటివిటీ అయితే కనిపిస్తుంది. అయితే నార్త్ లో సలార్ పై భారీ నెగిటివ్ ఇప్పుడు మొదలైంది.

సలార్ చిత్రం ఒక రీమేక్ సినిమా ఎవరూ చూడొద్దు అంటూ ప్రూఫ్స్ కూడ పెడుతున్నారు. ఐతే ఇది రీమేక్ కాదు అని కొత్త సబ్జెక్టు నేను ప్రభాస్ కోసం సిద్ధం చేసుకున్నది అని దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే తెలిపాడు. కానీ ఇది రీమేక్ సినిమానే అని సంగీత దర్శకుడు కూడా స్టార్టింగ్ లో చెప్పాడు.

అయితే ఈ సినిమా పట్ల ఇప్పుడు వైరల్ గా కొన్ని ప్రూఫ్స్ మారుతున్నాయి. ఎప్పుడో 2014 సమయంలోనే ప్రశాంత్ నీల్ తన “ఉగ్రం” చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలని అనుకున్నాడట. దీనిని అప్పుడు కన్నడ సినీ వర్గాలు ప్రచురించాయి.

అలాగే ఆ సినిమాలో హీరో ఇక్కడ సలార్ పాత్రకి కూడా చాలా పోలికలు కూడా కేవలం క్యారక్టరైజేషన్ వరకు కనిపించాయి. దీనితో సలార్ చిత్రం ఉగ్రం కి రీమేక్ కాదని ఎలా చెప్పగలరు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కూడా సరైన సమాధానాలు రావట్లేదు. వీటితో అయితే ఈ షాకింగ్ ఫ్యాక్ట్ వైరల్ గా మారింది. 
https://x.com/ProudIndia57234/status/1709039190321832391?s=20