లారెన్స్ .. ప్రముఖ కొరియోగ్రాఫర్ గానే కాకుండా హీరోగా, దర్శకుడిగా తెలుగు, తమిళ, హిందీ సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రీ సినిమాలో ఎక్కడో వెనకాల గ్రూప్ లో డాన్స్ చేసిన రాఘవ లారెన్స్ ని ఆ సమయంలో చిరంజీవి తనలోని టాలెంట్ ని గుర్తించి హిట్లర్ సినిమాలో సాంగ్ కి కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారు. చిరంజీవి ఇచ్చిన ఆ అవకాశాన్ని రాఘవ లారెన్స్ అధ్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఈ సాంగ్ అబీబీ అబీబీ అన్న సాంగ్. సినిమాలో హైలెట్ గా నిలిచి ఉంది.
ఈ సాంగ్ లో మెగాస్టార్ కోసం లారెన్స్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఇప్పటికీ కొన్ని ప్రోగ్రాంస్ లో వేస్తుంటారు. అలా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ ఈరోజు స్టార్ డైరెక్టర్ గా హీరోగా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు సమాజ సేవలోనూ లారెన్స్ ఎప్పటికప్పుడు తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు. ఇప్పటికే ఎంతోమంది పేదవాళ్ళకి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలను కాపాడాడు. ఇదే కాదు పేదవాళ్ళకి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ సహాయం చేయడానికి ముందుంటున్నాడు.
ఇప్పటి వరకు లారెన్స్ కాంట్రవర్సీలకి దూరంగా ఉన్నాడు. ఎప్పుడు అనవసరమైన విషయాలలో తల దూర్చింది కూడా లేదు. కాని తాజాగా లారెన్స్ తమ్ముడు వల్ల బ్యాడ్ అయ్యాడని అంటున్నారు. రాఘవ లారెన్స్ సోదరుడు ఎల్విన్ అలియాస్ వినోద్ వల్ల తనకి ప్రాణహాని ఉందని సినీ నటి దివ్య వాపోతోంది. పోలీసులతో కుమ్మక్కైన ఎల్విన్ తనను హతమార్చాలని చూస్తున్నాడని వెల్లడించింది. తాజాగా.. ఓ మీడియా సంస్థ ద్వారా దివ్య.. ఈ ఆరోపణలు చేసి సంచలనం అయింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్గా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న దివ్య గత కొన్నాళ్ళుగా లారన్స్ తమ్ముడు ఎల్విన్ తో నరకం చూస్తున్నట్టు తెలిపింది. దాంతో ఇప్పుడు లారెన్స్ ని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారట.