అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఒకానొక సమయంలో లావణ్య ఫుల్ బిజీగా అయిపోయింది. అయితే మధ్యలో ఆమె చేసిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో మళ్లీ తన సత్తా చాటుకుంది. కానీ మళ్లీ ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయింది. ఇక చివరగా అర్జున్ సురవరం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
లావణ్య త్రిపాఠికి గాయాలైనట్టు ఓ పిక్‌ను షేర్ చేసింది. ఆ గాయాలను తన పెట్ పెంపుడు కుక్కకు చూపిట్టెంది. లావణ్య చేతికి ఆ గాయాలు ఉండటంతో పెట్ కాస్త బాధపడినట్టు కనిపిస్తోంది. అయితే దాని వెనుకున్న అసలు గుట్టు ఆ పెట్‌కు తెలియదు. మరో పిక్ షేర్ చేస్తూ ఆ గాయాల వెనుకున్న కిటుకును తన అభిమానులకు చెప్పింది. ఎలాంటి కంగారు పడకండి అని ఏమీ కాలేదంటూ ఓ హింట్ ఇచ్చేసింది.
లావణ్య తన చేతికి గాయమైనట్టు.. వాటి నుంచి రక్తం కారుతున్నట్టు ఫోటోను షేర్ చేసింది. ఆ వెంటనే అది ప్రోస్థటిక్ మేకప్ మహిమ అంటూ గుట్టు విప్పేసింది. మరి ప్రోస్థటిక్ మేకప్ మాయ అలాన ఉంటుంది. ఒంట్లో భాగాలు తెగినట్టు.. రక్తం కారుతున్నట్టు.. పొడిచినట్టు ఇలా ప్రేక్షకులను భ్రమించేలా చేయడం దాని ప్రత్యేకత. అయితే లావణ్య ఇప్పుడు అలా ఎందుకు చేసిందో? సినిమా షూటింగ్ కోసమా? లేదా సరదా కోసమా? అన్నది మాత్రం చెప్పలేదు. అర్జున్ సురవరం సినిమాతో తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది లావణ్య. ఈ సినిమా సక్సెస్ కావడంతో వరుసగా ప్రాజెక్ట్‌లు చేతిలో వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు లావణ్య పేర్కొంది.