సాయి ధరమ్ తేజ్ తెరపై ఎంత కూల్‌గా ఉంటాడో బయట కూడా అంతే కూల్‌గా ఉంటాడు. మరీ ముఖ్యంగా సెట్‌లో అందరినీ కలుపుకుపోతాడు. అందర్నీ నవ్వుతూ ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే సాయి ధరమ్ తేజ్‌ను అందరూ లవ్లీ, కూల్, హంబుల్ అంటూ సంబోధిస్తుంటారు తాజాజా సాయి ధరమ్ తేజ్‌లోని మరో కోణాన్ని లావణ్య త్రిపాఠి బయట పెట్టింది. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.
లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ సినిమాలో కలిసి పని చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. తేజూ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజార్టల్లో ఒకటిగా నిలిచింది. సినిమా పోయినా ఓ అనుభవం మాత్రం వచ్చింది. అయితే నేడు ఈ సుప్రీం హీరో బర్త్ డే. ఈ సందర్భంగా లావణ్య అదిరిపోయే వీడియోను షేర్ చేసింది. షూటింగ్ గ్యాప్‌లో ఇద్దరూ కలిసి రచ్చ చేసినట్టు కనిపిస్తోంది.
కారులో వీరిద్దరూ సరదాగా ఓ వీడియోను చేశారు. సాయి ధరమ్ తేజ్ కెమెరామెన్‌గా మారి లావణ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. విలన్ రోల్‌ను పోషిస్తున్నట్టుగా లావణ్య నటించడం.. తేజూ కెమెరాను దగ్గరకు తీసుకెళ్లి కంటిని హైలెట్ చేసే సమయంలో మరింత కోపంగా ఉన్నట్టు లావణ్య నటించేసింది. ఈ షాట్ తీసినందుకు, మెమోరీగా ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సాయి ధరమ్ తేజ్‌కు లావణ్య విషెస్ తెలిపింది.