అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఎంత అందంగా ఉందో అంతే అందంగా నటిస్తుంది. మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అందంతో పాటు ప్రతిభ ఉన్న హీరోయిన్లు చాలా అరుదు. ఇవి రెండూ ఉన్న అదృష్టం కలిసి రాని వారు కూడా ఉంటారు. కానీ లావణ్యకు ఇవి మూడు కలిసి వచ్చాయి. అందుకే ఇంకా మంచి ఫాంలో ఉంది. కొత్తగా వస్తోన్న హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది.
లావణ్య ఈ లాక్ డౌన్‌లో హైద్రాబాద్‌లోని చిక్కుకుంది. అలా ఐదారు నెలలు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. లాక్ డౌన్ కాలాన్ని చక్కగా మంచి పనులకే వినియోగించింది. మాస్కులు కుట్టి అందరికీ పంచిపెట్టింది. సీసీసీకి విరాళాన్ని ఇచ్చి మంచి మనసును చాటుకుంది. అందమే కాదు మంచి మనసుందని నిరూపించుకుంది. ఇక అన్ లాక్ డౌన్ ప్రక్రియ మొదలవ్వడంతోనే ఇంటికి చెక్కేసింది. చాలా నెలల తరువాత ఇంటికి వెళ్లడంతో మహారాణి యోగం పట్టిందట. కాళ్లు కింద పెట్టకుండా ఇంట్లో వాళ్లు చక్కగా చూసుకున్నారట.
తాజాగా లావణ్య తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టింది. మామూలుగా లాక్ డౌన్ సమయంలో హీరోయిన్లందరూ వంటిట్లో దూరి కొత్త కొత్త వంటకాలను వారి వారి కుటుంబసభ్యులకు వండిపెట్టారు. అయితే లావణ్య కూడా వెరైటీలను ప్రిపేర్ చేయడం నేర్చుకున్నట్టుంది. తాజాగా లావణ్య చాక్లెట్ కేక్ తయారు చేసిందట. ఆ ఫోటోను షేర్ చేస్తూ నేనే తయారు చేశాను అంటూ గర్వంగా చెప్పుకుంది. ఆ ఫోటోలో ఉన్న కేక్‌ను చూస్తే ఎవ్వరికైనా నోరూరాల్సిందే. అయితే లావణ్య ఈ కేకుల బిజినెస్ పెట్టుకుంటే.. తనకున్న పాపులార్టీతో అవి కూడా బాగానే ఫేమస్ అవుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురుచల్లగా అనే రెండు చిత్రాలతో బిజీగా ఉంది.