అలా అనుకుని సంపతీ చూపెట్టకండి.. లావణ్య త్రిపాఠికి తెలివి బాగానే ఉంది!

Lavanya Tripathi About Her Problems In Life

లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అవుతోంది. ప్రతీరోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం లావణ్య సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటోంది. అర్జున్ సురవరం సినిమాతో వచ్చిన లక్ బాగానే వర్కవుట్ అవుతోంది. అంతకు ముందు లావణ్యకు సరైన హిట్ లేకపోవడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ అర్జున్ సురవరం హిట్ పడటంతో మళ్లీ బిజీగా అయిపోయింది.

సందీప్ కిషన్ హీరోగా రాబోతోన్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో హాకీ ప్లేయర్‌గా నటించడంతో కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇక ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చావు కబురు చల్లగా అనే చిత్రం కోసం శ్రమిస్తోంది. అర్ధరాత్రి కూడా షూటింగ్ సెట్‌లోనే ఉంటోంది. ఇక మరి లావణ్య జిమ్ సెంటర్‌లోనూ బాగానే చెమటోడ్చుతోంది. జీరో సైజ్‌లోకి వచ్చేందుకు బాగానే కష్టపడుతోన్నట్టు కనిపిస్తోంది. అయితే లావణ్య తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది.

Lavanya Tripathi About Her Problems In Life
Lavanya Tripathi About Her Problems In Life

చిన్నపిల్లలు స్కిప్పింగ్ ఆడితే తాడు ఎన్ని రకాలుగా చిక్కులు పడుతుందో అందరికీ తెలిసింది. అలాంటి ఓ ఫోటోను లావణ్య షేర్ చేస్తూ నా సమస్యలు అన్నీ తీరినట్టు కనిపిస్తాయి..కానీ అవేవీ తీరవు.. అచ్చం ఈ తాడులానే అని చెప్పుకొచ్చింది. ఇలా కామెంట్ చేసిన కొద్ది సేపటికే మరో కామెంట్ చేసింది. ఆ మెసెజ్ చూసి ఎవ్వరూ నాకు మెసెజ్ చేయకండి.. నాకు ఏమీ కాలేదు. ఎలాంటి సమ్యలు లేవు. సింపతీ చూపకండి అంటూ కవర్ చేసేసింది.

Lavanya Tripathi About Her Problems In Life
Lavanya Tripathi About Her Problems In Life