లావణ్య త్రిపాఠి చూడటానికి అమాయకంగా ఉంటుంది. ఆమె చేసే పాత్రలు కూడా అలాంటివే. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే లావణ్య త్రిపాఠి తన మొదటి సినిమా అందాల రాక్షసితోనే అందర్నీ కట్టిపడేసింది. ఇక భలె భలె మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు లావణ్య ఖాతాలో ఉన్నాయి. మధ్యలో కాస్త వెనక్కి తగ్గినా చివరగా అర్జున్ సురవరం అంటూ సూపర్ హిట్ కొట్టేసింది.
ఇక లావణ్య త్రిపాఠి ఈ లాక్ డౌన్‌లో హైద్రాబాద్‌లోనే చిక్కుంది. దాదాపు ఐదు నెలలు ఫ్యామిలీకి దూరంగానే ఉంది. ఈ లాక్ డౌన్‌లొ ఇక్కడే ఉంటూ చేతనైనా సాయాన్ని చేసింది. చుట్టు పక్కల వారి సాయంతో మాస్కులు కుట్టి అందరికీ పంచింది. లాక్ డౌన్ ఎత్తేయడంతో ఇంటికి వెళ్లింది. ఫ్యామిలితో చక్కగా ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా లావణ్య మీడియాపై ఓ సెటైర్ వేసింది. మామూలుగా సైలెంట్ అనిపించే లావణ్య ఇలాంటి కామెంట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించరు.
శరీరాకృతిని కించపరిచేలా వ్యాఖ్యాలు చేయడం తప్పు.. చుట్టూ ఉన్న వాళ్లని సంతోషపెట్టాలి అంటూ మీడియా చెబుతుంది. అదే మీడియా మళ్లీ.. ఆ హీరో, హీరోయిన్లు చబ్బీగా ఉన్నారు.. వెయిట్ తగ్గారు.. ఛార్మ్ కోల్పోయారు అంటూ రాస్తుంది.. మనం అందరినీ ఒకేలా ఎందుకు చూడటం లేదు.. తప్పు ఎవరు చేసిన తప్పే అంటూ మీడియాపై సెటైర్లు వేసింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం లావణ్య జిమ్‌లో తెగ కష్టపడుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా అనే రెండు చిత్రాలున్నాయి.