గాసిప్ : జస్ట్ షార్ట్ టైటిల్ తో పవన్ – సాయితేజ్ ప్రాజెక్ట్.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా కూడా ఒకటి. కాగా తాను లేటెస్ట్ గా తన “విరూపాక్ష” తో భారీ హిట్ అందుకోగా ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేసిన ఇంట్రెస్టింగ్ ఫాంటసీ డ్రామాలో అయితే తాను నటిస్తున్నాడు.

ఇక పవన్ ఆల్రెడీ తన టాకీ పార్ట్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చెయ్యగా ఈ సినిమాపై గత కొన్ని రోజులు నుంచి ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా అయితే సినిమా టైటిల్ పై చాలానే సస్పెన్స్ నడుస్తుండగా ఏకంగా మొదట 9 టైటిల్స్ అనుకున్నారని తెలిసింది.

దీనితో లాస్ట్ చేసి మూడు టైటిల్స్ ని ఫైనల్ చేశారు అన్నారు. అయితే ఇపుడు లేటెస్ట్ గాసిప్ ఒకటి బాగా వినిపిస్తుంది. దీనితో ఈ చిత్రానికి ఒక షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని చిత్ర యూనిట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ టైటిల్ జస్ట్ “బ్రో” అట. అవును ఇప్పుడు యూత్ పిలుచుకునే “బ్రో” అనే టైటిల్ ని మేకర్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ టైటిల్ ఇపుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పవన్ ని “బ్రో” అని పిలుస్తాడట. అందుకే ఈ టైటిల్ ని లాక్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ టైటిల్ అయితే జస్ట్ మరికొన్ని రోజుల్లోనే అనౌన్స్ కానుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.