ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర సక్సెస్ రేషియో చూసినట్టు అయితే సర్ప్రైజింగ్ గా ఆ చిత్రాల్లో చిన్న సినిమాలే ఎక్కువ ఉంటాయి అని చెప్పాలి. ఒకో నెల నుంచి అయితే ఒకో చిన్న చిత్రం బిగ్గెస్ట్ హిట్ కాగా ఈ చిత్రాల్లో ఐతే గత జూలై లో వచ్చిన బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ చిత్రం “బేబీ” కూడా ఒకటి.
మరి ఈ చిత్రం టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా విరాజ్ మరో హీరోగా నటించిన ఈ చిత్రం ఏకంగా 91 కోట్లకి పైగా గ్రాస్ ని అయితే రాబట్టింది. అయితే థియేటర్స్ లో అద్భుతమైన రన్ ని కంటిన్యూ చేసిన ఈ చిత్రం అయితే ఎట్టకేలకు ఫినిషింగ్ స్టేజి కి వచ్చింది.
దీనితో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై కూడా పలు వార్తలు రాగా మేము గతంలో చెప్పినట్టుగానే ఈ చిత్రం ఇప్పుడప్పుడే ఓటిటి లో వచ్చే ఛాన్స్ లేదని మేకర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఫైనల్ గా అయితే ఇప్పుడు ఐతే ఈ అవైటెడ్ చిత్రం ఓటిటి డేట్ ని ఇప్పుడు మేకర్స్ లాక్ చేసారు.
కాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ ఆగష్టు 25 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆహా గోల్డ్ ఉన్నవారికి అయితే మరో 12 గంటలు ముందే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి ఉంటుందని తెలిపారు. దీనితో ఈ సినిమా ఓటిటి డేట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఇదో గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి.
Get ready to witness the "Cult love story of the decade" one more time. ❤Baby will make you fall in love, scream in anger and cry at the same time. Premieres Aug 25. If you can’t wait till then, subscribe to aha gold and enjoy the movie 12 hours early.🤩@ananddeverkonda… pic.twitter.com/IkUv1duN89
— ahavideoin (@ahavideoIN) August 18, 2023