Manchu Lakshmi : మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి వచ్చిన మంచు లక్ష్మి తనకుంటూ సొంత గుర్తింపు కోసం కథాపరమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. సినిమాలే కాకుండా టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా హోస్ట్ గా రాణించారు. లక్ష్మి అమెరికాలో ఉన్నపుడు అక్కడి టెలివిజన్ లో కూడా నటించారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు.
సినిమా నేపథ్యంలోని కుటుంబం నుండి వచ్చిన తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని తెలిపారు. సినిమా నేపధ్యం ఉన్న తనకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని అనుకోలేదని చెప్పారు.చాలా మంది తన స్నేహితుల క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు తెలుసని ఇంటర్వ్యూ లో వెల్లడించారు. బాడీ షేమింగ్, ట్రోల్స్ అందరికి ఎదురవుతుంటాయని సినీ రంగమనే కాకుండా అన్ని రంగాల్లోను ఐటీ బ్యాంకింగ్ వంటి రంగాల్లోను క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు.
ఇలాంటి వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమని, కామెంట్ చేయడం బాడీ షేమింగ్, ట్రోల్స్ ను పట్టించుకోకూడదు. మనకు నచ్చినట్టు మనం ఉండటం నేర్చుకోవాలని చెప్పారు.ఎలా ఉన్న ట్రోల్ చేస్తారు కాబట్టి పట్టించుకోవడం మానేయాలని సదరు ఇంటర్వ్యూలో తెలిపారు.
అసలే ఈ జీవితం చాలా చిన్నది. అనుకున్నవి చేసేయాలి.. కోరుకున్నది సాధించుకోవాలి.. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.. ఎంతో సాధించాలి.. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పడం కూడా కష్టమే. ఈ ట్రోలింగ్, కాస్టింగ్ కౌచ్ ఇవేవీ కూడా మనల్ని ఆపకూడదు. మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మంచు లక్ష్మీ తమిళం, మలయాళంలో నటిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వస్తోన్న మాన్‌స్టర్ సినిమాలో నటిస్తోంది. ఇక తమిళ సినిమా కోసం మంచు లక్ష్మీ పోలీస్ ఆఫీసర్‌గా మారింది.