పవర్ స్టార్‌తో లేడీ పవర్ స్టార్.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్య సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే బిరుదిచ్చేశారు అభిమానులు ఆమెపై అమితాభిమానంగా. ఈ లేడీ పవర్ స్టార్, పవర్ స్టార్ కలిసి ఒకే స్ర్కీన్‌పై కనిపిస్తే ఎలా వుంటుంది.? చాలా ముచ్చటగా వుంటుంది కదా. ఆ ముచ్చటను కళ్లారా తిలకించాలని అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో సాయి పల్లవి పేరు పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఇప్పటికే పూజా హెగ్దే, శ్రీలీల పేర్లు దాదాపు ఖరారులో వున్నాయ్. అయితే, సాయి పల్లవిని ఓ స్పెషల్ రోల్ కోసం తీసుకోబోతున్నాడు హరీష్ శంకర్ అనీ సమాచారం. చిన్న రోలే అయినా, చాలా సర్‌ప్రైజింగ్‌గా షాకింగ్‌గా వుండబోతోందట ఆ రోల్.

చూడాలి మరి, నిజంగానే గెస్ట్ రోల్‌లో సాయి పల్లవిని తీసుకుంటారా.? లేదంటే పూజా హెగ్దేనీ, శ్రీలీలనీ పక్కన పెట్టేసి, లీడ్ హీరోయిన్ రోలే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి ఇచ్చేస్తారా.? అనేది తెలియాల్సి వుంది.