నైజాంలో మైండ్ బ్లాక్ చేస్తున్న “ఖుషి” రీ రిలీజ్ బుకింగ్స్.?

HDgallery_Kushi_Re_release_Stills_15_50_1_50

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యూత్ ఫుల్ భారీ హిట్ చిత్రం “ఖుషి”. తన కెరీర్ లో ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్ కాగా ఈ సినిమా అయితే మళ్ళీ రెండు దశాబ్దాలు తర్వాత రీ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ చిత్రం మాసివ్ లెవెల్లో రిలీజ్ కి ఇప్పుడు రాబోతుంది. పవన్ నటించిన జల్సా కన్నా తక్కువ బజ్ తోనే ఈ సినిమా స్టార్ట్ అయినా షాకింగ్ బుకింగ్స్ అయితే ఈ చిత్రం నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.

ప్రీ బుకింగ్స్ లో అయితే జల్సా సినిమా నైజాం ఏరియా లో సుమారు 75 లక్షల మేర వసూళ్లు అందుకోగా ఇప్పుడు ఖుషి అయితే సినిమా రిలీజ్ కి ఇంకా మూడు రోజులు ఉండగానే ట్రేడ్ వర్గాలకి ఖుషి సినిమా షాకిస్తుంది అని అంటున్నారు. మరి ఖుషి అయితే ఏకంగా ఆల్రెడీ 50 లక్షల గ్రాస్ ని ఈ చిత్రం కలెక్ట్ చేసేసింది అట. దీనితో పవన్ క్రేజ్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

మరి ఫైనల్ డే నాటికి ఈ సినిమా ఎంత వసూలు చేస్తుంది అనేది కూడా ఆసక్తిగా మారగా ఈ చిత్రం అయితే థియేటర్స్ లో డిసెంబర్ 31 నుంచి జనవరి 6 వరకు ఉండనుంది. ఇంకా ఈ సినిమాలో పవన్ కి జోడిగా భూమిక చావ్లా నటించగా ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు. అలాగే మణిశర్మ అదిరే ఆల్బమ్ ని ఈ చిత్రానికి అందించారు.