ఆది పురుష్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన కృతి సనన్… డబ్బింగ్ పనులలో బిజీగా మారిన నటి?

ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆది పురుష్ ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది.ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఎన్నో విమర్శలకు కూడా కారణమైంది. ఈ క్రమంలోనే ఈ టీజర్ పై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.

అదేవిధంగా మరికొంతమంది కొన్ని సినిమాలు కేవలం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటాయి అంటూ ఆది పురుష్ సినిమాకు మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి నటి కృతి సనన్ మరో క్రేజీ అప్డేట్ విడుదల చేశారు.ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నటి కృతి సనన్ డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోని కృతి శెట్టి గెట్ సెట్ డబ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. దీంతో ఈమె డబ్బింగ్ పనులలో బిజీగా ఉన్నారని అర్థమవుతుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రభాస్ లుక్ టీజర్ ప్రభాస్ అభిమానులకు కూడా సంతృప్తిని ఇవ్వలేకపోయాయి మరి ఈ సినిమా విడుదల అయ్యి థియేటర్లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.