ఐటెం సాంగ్‌లో బేబమ్మ.?

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు రావడంతో కృతి శెట్టి మనసు మార్చుకుందట. ఫెయిల్యూర్స్ కారణంగా హీరోయిన్‌ ఛాన్సులు తగ్గడంతో ఐటెం సాంగ్స్‌కి సై అంటోందట. ఆల్రెడీ తాను హీరోయిన్‌గా వర్క్ చేసిన హీరోతోనే ఓ ఐటెం సాంగ్‌లో నటించబోతోందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

అయితే, అది ఐటెం సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్ అని చెప్పుకుంటోందట కృతి శెట్టి. గతంలో ఇలా ఫెయిల్యూర్స్ చవిచూసిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇలా స్పెషల్ సాంగ్స్ అని చెప్పుకున్న ఐటెం సాంగ్స్‌తో కమ్ బ్యాక్ అయిన సందర్భాలున్నాయ్.

అలాగే, కృతి శెట్టికి కూడా సక్సెస్ వస్తుందేమో. అయితే, కృతి శెట్టిని ఐటెం సాంగ్‌లో చూడగలమా.? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమో.! చందమామ కాజల్ అగర్వాల్‌ని చూసిన తర్వాత ఇంకెవరైనా అంతే.!

అన్నట్లు కాజల్‌ కూడా ఒకానొక టైమ్‌లో ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిందే. ఒక్క ఐటెం సాంగ్‌తో సూపర్బ్ కమ్ బ్యాక్ అయ్యింది. అలాగే, కృతి శెట్టికీ దశ తిరుగుతుందేమో చూడాలిక.