ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ దాదాపు పూర్తి కావచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించనుండగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడి థియోటర్స్ ఓపెన్ అయితే సంక్రాంతి బరిలో ఈ సినిమా దింపాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారట.
అలాగే ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం .. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై పవర్ స్టార్ – క్రిష్ కాంబినేషన్ లో ఒక పీరియాడికల్ మూవీ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ కెరీర్ లో 27 వ సినిమాగా రాబోతుంది. ఒకే షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి ఓమ్ శివమ్ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఈ సినిమాలో ఉన్న ఒక కీలక పాత్రకి కంచె భామ ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోవాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నారని తెలుస్తోంది. అంతకు ముందు ప్రగ్యా స్టాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికి బ్రేక్ ఇచ్చింది మాత్రం కంచె సినిమా ద్వారా క్రిష్.
అయితే ఆ తర్వాత కూడా ప్రగ్యా చాలా సినిమాలు చేసింది. కాని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దాంతో అందరూ గత కొన్ని రోజులుగా ప్రగ్యా మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కి స్టార్ హీరోయిన్ అవ్వాలంటే క్రిష్ అవకాశం ఇచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇక ప్రగ్యా కి తిరుగుండదని మాట్లాడుకున్నారు. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు క్రిష్ అనుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి.
ప్రస్తుతం క్రిష్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 45 రోజుల నాన్ స్టాప్ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేయాలని క్రిష్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా కంప్లీట్ చేసి పవర్ స్టార్ సినిమాని మొదలు పెట్టనున్నాడు.