Akhanda 2: నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లలో సినిమా వస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తారు. అలాంటి కాంబినేషన్లో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటని చెప్పాలి ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి.
ఇక త్వరలోనే మరో సినిమా ద్వారా వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అఖండ సీక్వెల్ చిత్రంగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించబోతున్నారని సగతి మనకు తెలిసిందే ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా ఈమె పాల్గొని సందడి చేశారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాలో ప్రగ్యా హీరోయిన్ గ నటించడం లేదని పవన్ కళ్యాణ్ చెల్లెలు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించబోతున్నారని ఆమె షూటింగ్లో పాల్గొంటున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆమెకు స్వాగతం చెబుతూ ఒక పోస్టర్ విడుదల చేశారు . ఈమె పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాలో సంయుక్త భాగం కాబోతున్నారు అన్న విషయం తెలిసి ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించడం ఏంటి మరి ప్రగ్య పరిస్థితి ఏంటి అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రగ్య నటిస్తున్నారా లేదా అనే విషయం తెలియాలి అంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.