డార్లింగ్ ప్రభాస్ పెళ్లిపై కొనసాగుతున్న సస్పెన్స్ ఈనాటిది కాదు. చాలా కాలంగా అభిమానులు అతను పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి పిల్లను చూసినా కూడా ప్రభాస్ పెళ్లి అంటే ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పెదనాన్న మరోసారి ఊహించని విధంగా స్పందించారు.
కృష్ణంరాజు 80వ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే అప్పుడు ఆయన కేవలం ఒక్క మాట తోనే ఆ ప్రశ్నకు ఎండ్ కార్డ్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ పెళ్లెప్పుడు అంటే.. అయినప్పుడు అవుతుంది. మీరే కాదు. మేము కూడా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాము అంటూ వివరణ ఇచ్చారు.
ఒక విధంగా కృష్ణంరాజు ప్రభాస్ ను అడిగి అడిగి సైలెంట్ అయిపోయినట్లు టాక్ వస్తోంది. సింగిల్ గానే ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్న ప్రభాస్ వయసు ఇప్పుడు 41. అసలైతే గత ఏడాదే పెళ్లి జరగనున్నట్లు టాక్ గట్టిగానే వచ్చింది. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి మరో ఐదేళ్ల వరకు బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకున్న ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడు ఆలోచిస్తాడో చూడాలి.