టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజను తక్కువ అంచనా వేసినవారే ఇప్పుడు ఆయన వెంటపడి డేట్స్ ఇస్తే అడిగినంత ఇస్తామని అంటున్నారు. మొన్నటివరకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అన్నవాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి భారీగా అడ్వాన్సులు ఇచ్చి మరీ ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. మొత్తానికి క్రాక్ టీమ్ కు ఒక మంచి క్రేజ్ దక్కిందనే చెప్పాలి.
పొంగల్ పండగ బాక్సాఫీస్ సెంటిమెంట్ అని మరోసారి ఋజువయ్యింది. కాస్త క్లిక్కయినా చాలు పెట్టిన పెట్టుబడికు డబుల్ ప్రాఫిట్స్ కాయమని తేలిపోయింది. ఇక క్రాక్ విడుదలై నేటికి 10రోజులయ్యింది. ఇప్పటివరకు సినిమాకు వచ్చిన మొత్తం షేర్స్ 28.38కోట్లు. కేవలం 17.5కోట్ల బ్రేక్ ఈవెన్ ను సెట్ చేసుకున్న క్రాక్ కు లాభాలు గట్టిగానే వచ్చాయి.
క్రాక్ ఇప్పుడు 10.84కోట్లతో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. అంటే బ్లాక్ బస్టర్ హిట్టన్నట్లే. గతంలో ఎప్పుడు లేని విధంగా 50% కెపాసిటీ ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడిచినప్పటికి బలమైన కలెక్షన్స్ వచ్చాయి. విడుదలై పది రోజులైనా కూడా కలెక్షన్స్ హావా కోటికి తక్కువ రావడం లేదు. ఒకవేళ థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీతో నడిచి ఉంటే క్రాక్ లెక్క ఏ రేంజ్ లో ఉండేదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.